
క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ అధినేత చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కార్యాలయంలో సీసీఎస్ పోలీసులు సోమవారం సోదాలు నిర్వహించారు. ఆయన కార్యాలయం నుంచి 10 కంప్యూటర్లు, 15 హార్డ్ డిస్కులు, కొన్ని కీలక పత్రాలు, అకౌంట్లకు సంబందించి కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకొన్నారు.
సికింద్రాబాద్లోని లక్ష్మీకాంత శర్మ అనే జ్యోతిష్యుడు తీన్మార్ మల్లన్న తనను రూ.30 లక్షలు ఇమ్మనమని వేదిస్తున్నాడని, డబ్బు ఇవ్వకుంటే తన గురించి ప్రచారం చేస్తామని బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు చిలకలగూడా పోలీసులు తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేసి గత నెల 27వ తేదీన అరెస్ట్ చేసి చంచల్గూడా జైలుకి తరలించారు.
ప్రస్తుతం మూడు రోజుల పోలీసుల కస్టడీలో ఉన్న తీన్మార్ మల్లన్న చెప్పిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు మళ్ళీ ఆయన కార్యాలయంలో నిన్న సోదాలు జరిపారు. తీన్మార్ మల్లన్న కార్యాలయంలో పోలీసులు తనికీలు చేయడం ఇది మూడోసారి.