ఉపఎన్నికల షెడ్యూల్ జారీ కానీ....

కేంద్ర ఎన్నికల సంఘం శనివారం మధ్యాహ్నం ఉపఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది కానీ దానిలో హుజూరాబాద్‌ ఉపఎన్నిక లేదు. ఏపీ, తెలంగాణతో దేశంలో 11 రాష్ట్రాలలో ఉపఎన్నికలు జరుగవలసి ఉండగా కరోనా, వర్షాలు, పండుగల సీజను కారణంగా ఇప్పుడే ఎన్నికలు నిర్వహించవద్దని కోరినట్లు ఈసీ తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం కూడా హుజూరాబాద్‌ ఉపఎన్నిక పండుగల సీజన్ పూర్తయిన తరువాతే జరుపాలని కోరిందని కనుక షెడ్యూల్ ప్రకటించలేదని ఈసీ తెలిపింది. పండుగల సీజన్ ముగిసిన తరువాత మళ్ళీ మరోసారి రాష్ట్ర ప్రభుత్వాలను సంపారించింది ఉపఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని ఈసీ తెలిపింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భవానీపూర్, జంగీపూర్, షంషేర్ గంజ్ స్థానాలకు, ఒడిశాలోని పిప్లీ శాసనసభ స్థానానికి ఈనెల 30వ తేదీన ఉపఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ తెలిపింది.