నేడు హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు హైదరాబాద్‌ నగరంలో పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం విద్యా నగర్‌లోని అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగే ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. కనుక నగరంలో ఆయన కాన్వాయ్ ప్రయాణించే మార్గాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించి, వాహనాలను వేరే మార్గాలకు మళ్లిస్తున్నారు. 

జూబ్లీహిల్స్  నుంచి విద్యానగర్‌ మద్యలో జూబ్లీహిల్స్  చెక్‌పోస్టు, అన్సారీ మంజిల్, ఆర్డీవో కార్యాలయం, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, లేబర్టీ, హిమాయత్ నగర్‌, ఫీవర్ హాస్పిటల్‌, హిందీ మహావిద్యాలయ ప్రాంతాలలో ఈరోజూ ఉదయం 8.30 నుంచి  ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. కనుక ఈ ప్రాంతాల మీదుగా ప్రయాణించాలనుకొనేవారు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని వేరే మార్గాలలో తమ గమ్య స్థానాలు చేరుకోవడం మంచిది.