ప్రపంచంలో అత్యంత సుందరమైన, ఆహ్లాదకరమైన కశ్మీర్లో వేర్పాటువాదానికి బీజాలువేసి ఓ యుద్ధక్షేత్రంగా మారేచేసిన హురియత్ మాజీ నేత సయ్యద్ అలీ కేంద్రహోంమంత్రి అమిత్ షా గిలానీ (92) శ్రీనగర్లో మృతి చెందారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న గిలానీకి తాజాగా శ్వాస సంబందిత సమస్యలు కూడా మొదలవడంతో ఆరోగ్యం క్షీణించి కనుమూశారు. గిలానీ కోరిక మేరకు ఆయన మృతదేహాన్ని శ్రీనగర్లో ఆయన నివాసానికి సమీపంలో గల మసీదులో సమాధి చేశారు.
గిలానీ మొదటి నుంచి పాక్ అనుకూలంగా వ్యవహరిస్తూ, జమ్ముకశ్మీర్లో వేర్పాటువాదాన్ని పెంచిపోషించారు. కనుక గిలానీ మృతి పట్ల పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, పాక్లో పలువురు నేతలు సంతాపం తెలిపారు. గిలానీ మృతికి సంతాప సూచకంగా దేశవ్యాప్తంగా పాక్ జాతీయ పతాకాన్ని అవనతం చేసి సంతాపదినంగా పాటిస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. కశ్మీర్లో వేర్పాటువాదుల వెనుక, ఉగ్రదాడుల వెనుక పాకిస్థాన్ ప్రభుత్వం ఉందని చెప్పేందుకు ఇది మరో ప్రత్యక్ష సాక్ష్యంగా భావించవచ్చు.