సంబంధిత వార్తలు

తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్‌కు ఇటీవల కరోనా సోకింది. మూడు రోజులుగా ఇంట్లోనే ఉంటూ కరోనాకు చికిత్స పొందుతున్నారు. కానీ నిన్న సాయంత్రం నుంచి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆయనను జూబ్లీహిల్స్, అపోలో హాస్పిటల్‌లో చేర్చారు. ఆయనకు వెంటనే వైద్య పరీక్షలు చేసిన అపోలో వైద్యులు కరోనా కారణంగా ఆయన ఊపిరితిత్తులు దెబ్బ తిన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆయనను ఐసీయులో ఆక్సిజన్ అందిస్తూ చికిత్స చేస్తున్నారు. కానీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.