సంబంధిత వార్తలు
5.jpg)
రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఈరోజు నాంపల్లిలోని ఎంఎస్‌జె కోర్టు నోటీస్ జారీచేసింది. ఆ కేసులో ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఆధారంగా ఈడీ వేరేగా కేసు నమోదు చేసింది. అక్టోబర్ 4వ తేదీన ఆ కేసు విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. ఈకేసులో సహ నిందితులుగా పేర్కొనబడిన సెబాస్టియన్, ఉదయ్ సింహా, జెరుసలెం మత్తయ్య, వేంకృష్ణ కీర్తనలకు కూడా న్యాయస్థానం విచారణకు హాజరుకావాలంటూ ఈరోజు నోటీసులు జారీ చేసింది.