
గురువారం కాబూల్ విమానాశ్రయం వద్ద ఐసిస్ తీవ్రవాదులు జరిపిన రెండు ఆత్మహుతి దాడులలో 13 అమెరికన్ సైనికులతో సహా మొత్తం 200 మంది చనిపోయారు. దీనికి ప్రతీకారం తీర్చుకొంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పిన గంటల వ్యవధిలోనే అమెరికా డ్రోన్‌ను విమానాలు ఆఫ్ఘనిస్తాన్‌లో నంగర్‌హర్ అనే ప్రాంతంలో ఐసిస్ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడులలో కాబూల్ విమానాశ్రయం వద్ద ప్రేలుళ్ళ సూత్రధారి మరణించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి కెప్టెన్ విలియం అర్బన్ తెలిపారు.
అమెరికా ఇంత వేగంగా స్పందిస్తుందని ఐసిస్ తీవ్రవాదులు ఊహించి ఉండరు. కానీ వారు కూడా మళ్ళీ ప్రతీకారదాడులు చేయవచ్చు. కనుక ఇప్పుడు తాలిబన్లకు వారొక పెద్ద సవాలుగా మారారని భావించవచ్చు. కరుడుగట్టిన నరహంతక ముఠాలైన తాలిబన్లు, ఐసిస్ ఉగ్రవాదుల మద్య పోరాటాలు మొదలైతే ఆఫ్ఘనిస్తాన్‌లో సామాన్య ప్రజల జీవితాలు మరింత దుర్బరమవుతాయి.