
క్యూ న్యూస్ యూ ట్యూబ్ ఛానల్ వ్యవస్థాపకుడు సిహెచ్ నవీన్ అలియాస్ తీన్‌మార్ మల్లన్నను శుక్రవారం రాత్రి చిలకలగూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్‌లో మారుతి జ్యోతిష్యాలయం యజమాని ఎస్ లక్ష్మీకాంతశర్మ ఫిర్యాదు మేరకు తీన్‌మార్ మల్లన్నపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తీన్‌మార్ మల్లన్న తనను రూ.30 లక్షలు ఇవ్వాలని లేకుంటే క్యూ న్యూస్ ఛానల్‌లో తన జ్యోతిష్యాలయం గురించి చెడు ప్రచారం చేస్తానని బెదిరిస్తున్నాడని, అతను అడిగిన డబ్బు ఇచ్చేందుకు తాను నిరాకరించడంతో కొంతమంది వ్యక్తులను తన జ్యోతిష్యాలయానికి పంపిస్తూ రోజూ తనని ఇబ్బంది పెడుతున్నాడని లక్ష్మీకాంతశర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు తీన్‌మార్ మల్లన్నను అరెస్ట్ చేశారు. ఈరోజు కోర్టులో హాజరుపరిచనున్నారు. ఒకవేళ కోర్టు ఆయనకు రిమాండ్ విధించి బెయిల్‌పై నిరాకరిస్తే జైలుకి తరలిస్తారు.