ఆ మూడు ఆసుపత్రులకు ఒకటే పేరు..టిమ్స్

హైదరాబాద్‌ నగరంలో ఎర్రగడ్డ, అల్వాల్, ఎల్బీ నగర్‌లో ప్రభుత్వం కొత్తగా నిర్మించనున్న మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు కూడా తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ (టిమ్స్) అనే పేరునే ప్రభుత్వం ఖరారు చేసింది. ఇప్పటికే గచ్చిబౌలిలో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి టిమ్స్ అని పేరు ఉంది. వరంగల్‌లో  నిర్మించబోతున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటలల్‌తో సహా  భవిష్యత్తులో రాష్ట్రంలో నిర్మించబోయే అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కు కూడా టిమ్స్ పేరుతో తెలంగాణ బ్రాండింగ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.