
దళిత బంధు పధకానికి రాష్ట్ర ప్రభుత్వం బుదవారం మరో రూ.300 కోట్లు విడుదల చేసింది. ఈ సొమ్ము కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్ ఖాతాలో వెంటనే జమా అయ్యింది. దీంతో ఇప్పటివరకు మొత్తం రూ.1,500 కోట్లు విడుదల చేసినట్లయింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పధకం అమలు కోసం రూ. 2,000 కోట్లు కేటాయిస్తానని సిఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కనుక త్వరలో మరో రూ.500 కోట్లు విడుదల చేయనుంది.
రేపటి నుంచి హుజూరాబాద్ 400 మంది అధికారులు హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతీ గ్రామానికి వెళ్ళి దళిత కుటుంబాల వివరాలు సేకరించి వెంటనే వారికి బ్యాంక్ పాస్ పుస్తకాలు కూడా ఏర్పాటు చేస్తారు. సెప్టెంబర్ 3తో ఈ ప్రక్రియ పూర్తవగానే లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలలోకి దళిత బంధు పధకం కింద రూ.9,90,000 సొమ్ము జమా చేయబడుతుంది. మిగిలిన రూ.10,000 దళిత రక్షణ నిధిలో జమా చేయబడుతుంది.
తాజా సమాచారం: రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు (గురువారం) మిగిలిన రూ.500 కోట్లు విడుదల చేసింది. దీంతో మొత్తం రూ. 2,000 కోట్లు విడుదల చేయడం పూర్తయింది. ఇక దానిని పంచిపెట్టడమే ఆలస్యం.