కాబూల్ నుంచి బయలుదేరిన ఉక్రెయిన్ విమానం హైజాక్

కాబూల్ నుంచి బయలుదేరిన ఉక్రెయిన్ విమానం హైజాక్ అయినట్లు ఆ దేశ విదేశాంగశాఖ డెప్యూటీ మంత్రి యెవ్‌జెనీ యెనిన్ దృవీకరించారు. కాబూల్ నుంచి తమ పౌరులను తరలించడానికి వినియోగిస్తున్న ఉక్రెయిన్‌ ఇంటర్నేషనల్ మంగళవారం విమానంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇరాన్‌కి వెళ్ళినట్లు గుర్తించామని తెలిపారు. వారిలో కొంతమంది తుపాకులతో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. కనుక గుర్తుతెలియని వ్యక్తులు తమ విమానాన్ని దొంగిలించి హైజాక్ చేసినట్లు భావిస్తున్నామని యెవ్‌జెనీ యెనిన్ తెలిపారు. 

కాబూల్ విమానాశ్రయం అమెరికన్ సైనికుల పర్యవేక్షణలో ఉంది. సుమారు 6,000 మంది సైనికులు దానిని పర్యవేక్షిస్తున్నారు. విమానాశ్రయంలోనికి ఎవరు ప్రవేశించాలన్నా వారి అనుమతి లేకుండా సాధ్యం కాదు. అటువంటప్పుడు ఆయుధాలు ధరించిన దుండగులు ఉక్రెయిన్ విమానంలో ఎలా జొరబడ్డారు. ఏవిదంగా దానిని హైజాక్ చేశారనేది పెద్ద ప్రశ్నగా నిలుస్తోంది. ఆ విమానాన్ని తాలిబన్లు హైజాక్ చేశారా లేదా వారి సహకారంతో ఐసిస్ లేదా మరేదైనా ఉగ్రవాద సంస్థ హైజాక్ చేసిందా? విమానంలో ఎంతమంది ఉన్నారు? వారు ఎవరు?అనే సమాచారం ఇంకా అందవలసి ఉంది.