సంబంధిత వార్తలు

బిజెపి సీనియర్ నేత కళ్యాణ్ సింగ్ (89) తీవ్ర అనారోగ్యంతో శనివారం తుది శ్వాస విడిచారు. కళ్యాణ్ సింగ్ యూపీ ముఖ్య మంత్రిగా, రాజస్థాన్ గవర్నర్‌గా పని చేశారు. గత నెల 4న ఆయన ఆరోగ్యం ణించడంతో లక్నోలోని సంజయ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. నిన్న అంతర్గత అవయవాలు పని చేయడం నిలిచిపోవడంతో కన్నుమూసారు. ఆయన మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.