జస్టిస్ హిమా కోహ్లీ మళ్ళీ సుప్రీంకోర్టుకి బదిలీ

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ హిమా కోహ్లీ పదవీకాలం వచ్చే నెల 2వ తేదీతో ముగియనుంది. కానీ ఆమెకు మరో మూడేళ్ళు పొడిగింపు లభించింది. ఆమె ఇక్కడ పదవీ విరమణ చేసిన తరువాత మళ్ళీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సుప్రీంకోర్టులోనే ఆమె మూడేళ్ళు న్యాయమూర్తిగా పనిచేస్తారు. 

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆమె పదవీ విరమణ చేసిన తరువాత ఆమె స్థానంలో మరొకరు నియమింపబడే వరకు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.