తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు నియామకం

తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు నియామకంకానున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం ఏడుగురు న్యాయమూర్తుల పేర్లను కేంద్రప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ ఏడుగురు ప్రస్తుతం రాష్ట్రంలో జిల్లా కోర్టులు మరియు ట్రైబ్యునల్స్ లో సీనియర్ న్యాయమూర్తులుగా పనిచేస్తున్నారు. కొలీజియం సిఫార్సుకు కేంద్రప్రభుత్వం, రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం లాంఛనప్రాయమే కనుక త్వరలోనే ఈ ఏడుగురు న్యాయమూర్తులు హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందనున్నారు. వారి వివరాలు: 

 జస్టిస్ పి.సుధ: ప్రస్తుతం కోఆపరేటివ్‌ ట్రిబ్యునల్‌ చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు.

జస్టిస్ డాక్టర్‌ సి.సుమలత:  ప్రస్తుతం సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా పనిచేస్తున్నారు.

జస్టిస్‌ డాక్టర్‌ జి.రాధారాణి: ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు.

జస్టిస్‌ పి.మాధవీదేవి: ఆదాయం పన్నుశాఖ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఐటీఏటీ) సభ్యురాలిగా హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు.

జస్టిస్‌ ఎం.లక్ష్మణ్‌: ప్రస్తుతం లేబర్‌కోర్టు జడ్జిగా పనిచేస్తున్నారు.

జస్టిస్‌ ఏ. వెంకటేశ్వర్‌రెడ్డి: . ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా పనిచేస్తున్నారు.

జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీ: ప్రస్తుతం హైదరాబాద్‌ క్రిమినల్‌ కోర్టుల మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జిగా పనిచేస్తున్నారు.