సంబంధిత వార్తలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు, సహాయ సిబ్బందికి తీపి కబురు అందించింది. అంగన్వాడి టీచర్, సహాయ సిబ్బందికి 30 శాతం మేర వేతనాలు పెంచుతూ మహిళ, శిశు సంక్షేమ శాఖ బుధవారం ఉత్తర్వులను జారీ చేసింది. పెంచిన వేతనాలను జూలై నుంచి ఇవ్వనున్నట్లు తెలిపింది. గతంలో అంగన్వాడి టీచర్లకు వేతనం నెలకు రూ.10, 500 ఉండగా ఇప్పుడు అది రూ.13,650, మినీ అంగన్వాడి టీచర్లకు రూ.6,000 నుంచి రూ. 7,800, అంగన్వాడీ కార్యకర్తలకు రూ.6, 000 నుంచి రూ.7,800 కు పెంచింది.