జన్‌ధన్‌ దరఖాస్తులు కూడా స్వీకరించండి: కేటీఆర్‌ సూచన

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధుతో సహా అన్ని సంక్షేమ పధకాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు, నిరుద్యోగ భృతి కోసం అర్హులైనవారి నుంచి బిజెపి ‘దరఖాస్తుల ఉద్యమం’ పేరిట దరఖాస్తులు స్వీకరిస్తోంది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ నిన్న ఈ కార్యక్రమాన్ని కరీంనగర్‌లో ప్రారంభించారు. 

దీనిపై మంత్రి కేటీఆర్‌ వ్యంగ్యంగా స్పందించారు. “బీజేపీ తెలంగాణ ప్రారంభించిన ఈ దరఖాస్తుల ఉద్యమాన్ని స్వాగతిస్తున్నాను. ప్రధాని మూడీ హామీ ఇచ్చిన 15 లక్షల కొరకు తెలంగాణ ప్రజలందరూ కూడా బిజెపీకి దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నాను” అని ట్వీట్ చేశారు.  


2020 లోక్‌సభ ఎన్నికలలో తమ పార్టీ గెలిచి కేంద్రంలో అధికారంలోకి వస్తే, విదేశాలలో ఉన్న నల్లధనం వెనక్కు రప్పించి దానిని రూ.15 లక్షల చొప్పున ప్రజలకు పంచిపెడతామని ఆనాడు ప్రధాని నరేంద్రమోడీ హామీ ఇచ్చారు. కానీ మళ్ళీ అధిరాంలోకి వచ్చి రెండున్నరేళ్ళు అవుతున్నా విదేశాలలోని నల్లధనాన్ని వెనక్కు రప్పించలేకపోయారు. ఆ హామీని నిలబెట్టుకోలేకపోయారు. టిఆర్ఎస్‌ నేతలకు అవకాశం చిక్కినప్పుడల్లా దాని గురించి ఇలా కేంద్రప్రభుత్వాన్ని, బిజెపి నియాలదీస్తుంటారు.