
వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల పేర్లను హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. హన్మకొండ జిల్లాలో 12, వరంగల్ జిల్లాలో 15 మండలాలు ఉందేవిదంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
పశ్చిమ వరంగల్ నియోజకవర్గాన్ని పూర్తిగా హన్మకొండ జిల్లాలో కలిపింది. అలాగే వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి హాసన్పర్తి, ఐనవోలు మండలాలు హన్మకొండ జిల్లాలోనే ఉంచింది. స్టేషన్ ఘన్పూర్కు చెందిన ధర్మాసాగర్, వేలేరు, పరకాల నియోజకవర్గంలోని పరకాల, దామెర, నడికుడ మండలాలు, హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు, హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి కమలాపూర్ హన్మకొండ జిల్లాలో కలిపింది.