ఎమ్మెల్యేగా నోముల భగత్ ప్రమాణస్వీకారం

నోముల భగత్ ఈరోజు  ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ ఆలీ, జగదీష్ రెడ్డి, నోముల భగత్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. 

టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఖాళీ అయిన నాగార్జునసాగర్ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో సీనియర్ కాంగ్రెస్‌ నేత కె.జానారెడ్డిపై నోముల భగత్ 18 వేల ఓట్లకు పైగా భారీ మెజార్టీతో గెలిచిన సంగతి తెలిసిందే.