
జూలై 19 నుంచి మొదలైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో మొట్టమొదటిసారిగా అధికార, ప్రతిపక్షాలు ఏకగ్రీవంగా నిన్న లోక్‌సభలో ఓబీసీ బిల్లుకు ఆమోదం తెలిపాయి. ఈ బిల్లుకు ప్రతిపక్షాలు మద్దత్తు ఇస్తున్నందున నేడు రాజ్యసభలో కూడా ఆమోదం పొందడం ఖాయమే. ఈ బిల్లు ద్వారా రాష్ట్రాలకు ఇతర వెనుకబడిన కులాలను (ఓబీసీ) గుర్తించేందుకు హక్కు లభిస్తుంది. అయితే 50 శాతం కంటే మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదనే నిబంధన వలన ఓబీసీలను గుర్తించినప్పటికీ వారికి ఎటువంటి ప్రయోజనమూ దక్కదని కనుక, ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం విధించిన ఈ నిబందనను తొలగించాలని ప్రతిపక్షాలు లోక్‌సభలో డిమాండ్ చేశాయి. కానీ ఈ విషయంలో సుప్రీంకోర్టు చాలా నిర్ధిష్టంగా వ్యవహరిస్తునందున, న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకొన్నాక నిర్ణయం తీసుకొంటామని కేంద్ర కార్మిక శాఖా మంత్రి భూపేందర్ ప్రతిపక్షాలకు తెలిపారు.