వారం రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో సాహెబ్ నగర్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో కొట్టుకుపోయిన పారిశుధ్య కార్మికుడు అంతయ్య మృతదేహాన్ని పురపాలక సిబ్బంది ఈరోజు వెలికి తీశారు.
సాహెబ్ నగర్‌లో ఓ మ్యాన్ హోల్ పూడుకు పోవడంతో శివ, అంతయ్య అనే ఇద్దరు పారిశుధ్య కార్మికులు దానిలో దిగి కొట్టుకుపోయారు. వారిలో శివ మృతదేహం మర్నాడే వెలికితీశారు. కానీ అంతయ్య మృతదేహం కోసం వారం రోజులుగా 300 మంది జీహెచ్‌ఎంసీ సిబ్బంది, ఇంజనీర్లు, నాలుగు సహాయ బృందాలు అధికారులు గాలిస్తూనే ఉన్నారు. ఆ డ్రైనేజీలోకి సిసి కెమెరాను పంపించి వెతుకుతూ చివరికి 200 మీటర్ల దూరంలో గల మరో పెద్ద డ్రైనేజీ పైపులో అంతయ్య మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. ఆ ప్రదేశంలో జేసీబీతోఅండర్ గ్రౌండ్ డ్రైనేజీను తవ్వి అంతయ్య మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున చెరో పది లక్షలు, వారు పనిచేస్తున్న కాంట్రాక్టర్ తరపున చెరో 5 లక్షలు అందించినట్లు తెలుస్తోంది.