హుజూరాబాద్‌ దళిత బంధు పధకానికి 500 కోట్లు విడుదల

ఈనెల 16వ తేదీన హుజూరాబాద్‌ నియోజకవర్గంలో సిఎం కేసీఆర్‌ భారీ బహిరంగ సభలో దళిత బంధు పధకం పైలట్ ప్రాజెక్టు ప్రారంభించనున్నారు. కనుక తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఈ పధకం కోసం రూ.500 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పధకంపై ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలతో ప్రజలలో అపోహలు, అనుమానాలు తలెత్తుతుతున్నాయి. వాటినిపటాపచాలు చేస్తూ ప్రభుత్వం వాళ్ళ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పధకం క్రింద సిఎం కేసీఆర్‌ ఇప్పటికే వాసాలమర్రి గ్రామంలో 76 దళిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొపున రూ.7.6 కోట్లు నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే.