కృష్ణా, గోదావరి బోర్డు సమావేశాకు తెలంగాణ డుమ్మా

నేడు హైదరాబాద్‌ నగరంలో జలసౌధ కార్యాలయంలో కృష్ణా, గోదావరి బోర్డులు అత్యవసర సమావేశం జరుగుతోంది. కృష్ణా బోర్డు (కెఆర్ఎంబీ), గోదావరి బోర్డు (జిఆర్ఎంబీ) చైర్మన్ల అధ్యక్షతన, రెండు బోర్డుల సభ్య కార్యదర్శులు, సభ్యులు, పాల్గొన్నారు. ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన అన్ని ప్రాజెక్టులను రెండు బోర్డుల అధీనంలోకి తెస్తూ గెజిట్ నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. దానిపై రెండు రాష్ట్రాలు ఈ సమావేశంలో తమ వాదనలు వినిపించాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం తరపున జలవనరుల శాఖ కార్యదర్శి, ఈఎన్‌సీ, ఇంజనీర్లు హాజరయ్యి తమ వాదనలు వినిపించారు. అత్యంత ముఖ్యమైన ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం గైర్‌ హాజరైంది. 

ఈ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరినప్పటికీ రెండు బోర్డులు నేడు సమావేశం నిర్వహిస్తుండటంతో దానికి హాజరుకాలేమని తెలియజేస్తూ తెలంగాణ ప్రభుత్వం లేఖలు వ్రాసింది. ఆ లేఖల ప్రతులను రాష్ట్ర సాగునీటిశాఖ ఉన్నతాధికారులు ఈరోజు ఉదయం కృష్ణా, గోదావరి బోర్డు చైర్మన్లకు అందజేశారు.