రేపు తెలంగాణ మంత్రివర్గ సమావేశం

రేపు అంటే ఆగస్ట్ 1వ తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో జరుగబోయే ఈ సమావేశంలో ప్రధానంగా దళిత బంధు పధకంపై చర్చించి ఆమోదముద్ర వేస్తారు. దళితులకు, చేనేత కార్మికులకు భీమా పధకంపై కూడా చర్చించి ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం. కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన ప్రాజెక్టులను ఆయా బోర్డుల పరిధిలోకి తెస్తూ కేంద్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై కూడా ఈ సమావేశంలో చర్చించి తదుపరి కార్యాచరణను ఖరారు చేయవచ్చు. రాష్ట్రంలో కరోనా తాజా పరిస్థితులు, విద్యాసంస్థలను తెరవడంపై కూడా చర్చిస్తారని తెలుస్తోంది.