
బిజెపి నేత ఈటల రాజేందర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రజా దీవెన పాదయాత్రలో భాగంగా ఈరోజు వీణవంక మండలంలోని కొండపాక వద్దకు చేరుకొన్నప్పుడు హటాత్తుగా నీరసించిపోవడంతో వెనుకే వస్తున్న ప్రత్యేక బస్సులోని వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. ఆయనకు స్వల్ప జ్వరం ఉన్నట్లు గుర్తించారు. ఆయన బీపీ, ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. వారి సూచన మేరకు ఈటల రాజేందర్ పాదయాత్రను విరమించుకొన్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక బస్సులో హైదరాబాద్ నీమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. జూలై 19వ తేదీ నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయన 222 కిమీ మేర పాదయాత్ర చేశారు. ఇప్పుడు అస్వస్థతకు గురికావడంతో ఆయన మళ్ళీ పూర్తిగా కోలుకొనేవరకు ఆయన భార్య జమున పాదయాత్ర కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నట్లు తాజా సమాచారం.