బిజెపి నేత ఈటల రాజేందర్ బావమరిది మధుసూధన్ రెడ్డిపై ఎమ్మార్పీఎస్ నేతలు హుజూరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన దళితులను కించపరిచేవిదంగా మాట్లాడి తమ మనోభావాలను దెబ్బతీశారని కనుక ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నియోజకవర్గంలో జమ్మికుంట, వీణవంక, ఇల్లందుకుంటలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఈ ఫిర్యాదు చేశారు.
టిఆర్ఎస్ నేతలే మధుసూధన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈవిదంగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ నిన్న హుజూరాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో ఈటల రాజేందర్ అనుచరులు సిఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసనలు తెలిపారు. టిఆర్ఎస్ కార్యకర్తలు అక్కడకు చేరుకొని వారిని అడ్డుకొనే ప్రయత్నంలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. పోలీసులు లాఠీ ఛార్జీ చేసి వారిని చెదరగొట్టారు.