కరీంనగర్‌ పోలీస్ కమీషనర్‌ బదిలీ!

హుజూరాబాద్‌ ఉపఎన్నిక గంట మ్రోగకమునుపే చకచకా అధికారుల బదిలీలు జరిగిపోతున్నాయి. ఇటీవల జిల్లా కలెక్టరును బదిలీ చేయగా తాజాగా జిల్లా పోలీస్ కమీషనర్‌ కమల్ హాసన్‌ రెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రామగుండం పోలీస్ కమీషనర్‌ సత్యనారాయణను నియమిస్తూ డిజిపి మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కమల్ హాసన్‌ను తన కార్యాలయంలో రిపోర్ట్ చేయవలసిందిగా డిజిపి ఆదేశించారు. రామగుండం పోలీస్ కమీషనర్‌గా రమణకుమార్ నియమితులయ్యారు.