.jpg)
నిన్న భారీ ఊరేగింపుగా ప్రగతి భవన్కు చేరుకొని సిఎం కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిన పాడి కౌశిక్ రెడ్డికి జీహెచ్ఎంసీ రూ.10 లక్షలు జరిమానా విధించింది. ఆయన ఊరేగింపు కారణంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రధానరాహదారులలో చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. అదే సమయంలో వర్షం కూడా కురుస్తుండటంతో వాహనదారులు చాలా ఇబ్బంది పడ్డారు. అదీగాక రోడ్డు పొడవునా అనుమతి లేకపోయినా భారీ ఫ్లెక్సీ బ్యానర్లు, కటవుట్లు ఏర్పాటు చేశారు. కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు ట్విట్టర్ ద్వారా నగర కమీషనరుకి పిర్యాదులు చేశారు. వాటిపై స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు కౌశిక్ రెడ్డికి జీహెచ్ఎంసీ రూ.10 లక్షలు జరిమానా విధించారు. అయితే చాలామంది రాజకీయ నాయకులు ఇటువంటివాటికి సిద్దపడే ఊరేగింపులు చేపడుతుంటారు కనుక కౌశిక్ రెడ్డి కూడా ఈ జరిమానా చెల్లించడానికి వెనుకాడకపోవచ్చు. అయితే సిఎం కేసీఆర్ కౌశిక్ రెడ్డిని మందలించి ఉంటే బాగుండేది. ప్రతిపక్ష పార్టీలు ర్యాలీలకు పోలీసులు అనుమతి నిరాకరిస్తుంటారు కానీ అధికార పార్టీ నేతల ఊరేగింపులను మాత్రం అనుమతిస్తుంటారు?