కరీంనగర్‌ కలెక్టర్ బదిలీ... ఉపఎన్నిక కోసమేనా?

కరీంనగర్‌ జిల్లా కలెక్టర్ కె.శశాంక్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆర్‌.వి. కర్ణన్ నియమితులయ్యారు. శశాంక్‌ను సాధారణ పరిపాలన విభాగానికి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న వీపీ గౌతం ఖమ్మం జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మహబూబాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న అభిలాష అభినవ్‌ను అదే జిల్లాకు తాత్కాలిక కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

త్వరలో హుజూరాబాద్‌ ఉపఎన్నికలు జరుగనున్నందునే ప్రభుత్వం కరీంనగర్‌ జిల్లా కలెక్టరును మార్చిందా లేదా సాధారణంగా జరిగే బదిలీలలో భాగంగానే ఈ మార్పులు జరిగాయా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.