నేటి నుంచి కాచిగూడ-కరీంనగర్‌ రైళ్లు ప్రారంభం

 సుమారు 16 నెలల తరువాత మళ్ళీ నేటి నుంచి కాచిగూడ-కరీంనగర్‌-కాచిగూడ మద్య మెట్రో రైల్‌లో సర్వీసులు ప్రారంభం అయ్యాయి. వీటిని డెము ప్రత్యక రైళ్ళుగా నడిపించబోతున్నట్లు ద.మా.రైల్వే శాఖ తెలిపింది. 

రైలు నెంబర్: 07793 ప్రతీరోజు ఉదయం 6 గంటలకు కాచిగూడలో బయలుదేరి సీతాఫల్ మండి, మల్కాజిగిరి, బొల్లారం, గుండ్లపోచంపల్లి, మేడ్చల్, మనోహరాబాద్ (7.17గం.), మాసాయిపేట(7.30 గం.), వడియారం(7.40 గం.), మీర్జాపల్లి (7.50 గం.), అక్కన్నపేట(8.00 గం.), నిజామాబాద్‌(10.30 గం.) మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు కరీంనగర్‌ చేరుకొంటుంది. 

రైలు నెంబర్: 07794 ప్రతీరోజు మధ్యాహ్నం 2.20 గంటలకు కరీంనగర్‌ నుంచి బయలుదేరి నిజామాబాద్‌, కామారెడ్డి, అక్కన్నపేట (రాత్రి 7.47 గం.),మీర్జాపల్లి (7.58గం.), వడియారం (8.08 గం.), మాసాయిపేట (8.19 గం.), మనోహరాబాద్ (8.33గం.), మేడ్చల్ మీదుగా రాత్రి 11 గంటలకు కాచిగూడ చేరుకొంటుంది.  

దీంతో పాటు నేటి నుంచే దశలవారీగా 82 అన్‌రిజర్వ్‌డ్‌ రైల్‌ సర్వీసులు కూడా ప్రారంభం కానున్నాయి. వీటిలో 66 ప్యాసింజర్ రైళ్ళు, 16 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు ఉన్నాయి. వాటి వివరాలు:       

ప్యాసింజర్ రైళ్ళు: 

కాచిగూడ-మహబూబ్‌నగర్‌(07789), మహబూబ్‌నగర్‌-కాచిగూడ(07790), కాచిగూడ-నడికుడి (07791), నడికుడి-కాచిగూడ(07792), కాచిగూడ-కరీంనగర్‌ (07793), వాడి-కాచిగూడ (07751), ఫలక్‌నుమా-వాడి (07752), డోర్నకల్‌-కాజీపేట్‌ (07754), విజయవాడ-డోర్నకల్‌ (07756), సికింద్రాబాద్‌-కలబుర్గీ (07760). 

ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు:  

హైదరాబాద్‌-పూర్ణ (07653), పూర్ణ - హైదరాబాద్‌ (07654), కాజీపేట్‌-సిర్పూర్‌ టౌన్‌ (07272), సిర్పూర్‌టౌన్‌-కాజీపేట్‌(07259). 

ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి కూడా రాకపోకలు సాగించే మరికొన్ని ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు నేటి నుంచే ప్రారంభం కానున్నాయి.