
తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్‌పామ్ రైతులకు శుభవార్త! రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నగదు రూపంలో భారీ ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది. తద్వారా 2022-23లో రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగయ్యేలా చేయాలని నిర్ణయించింది. ఆయిల్‌పామ్ రైతులకు రైతుబంధు తరహాలో మొదటి సం. ఎకరాకు రూ.26,000, రెండో సం.రూ.5,000, మూడో సం.లో రూ.5,000 చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని అందించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఆయిల్‌పామ్ సాగు విధానాల గురించి తెలుసుకొనేందుకు మంత్రులు, ప్రజాప్రతిధులు, వ్యవసాయశాఖ అధికారుల బృందాలు ఆయిల్‌పామ్ ఎక్కువగా సాగు చేస్తున్న మలేషియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్, కోస్టారికా దేశాలకు పంపించాలని మంత్రివర్గం నిర్ణయించింది.