మళ్ళీ ఎస్సారెస్పీ అంచనాలు పెంపు!

బుదవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) పునరుజ్జీవ పథకం అంచనా వ్యయాన్ని మళ్ళీ పెంచే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశారు. మొదట ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1091 కోట్లు ఉండగా దానిని ఇదివరకు రూ.1,751 కోట్లకు పెంచిన సంగతి తెలిసిందే. మళ్ళీ దానిని రూ.1,999 కోట్లకు పెంచేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అంటే ప్రాజెక్టు వ్యయం మరో రూ.248 కోట్లు పెరిగిందన్న మాట! ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆలస్యం అవుతున్నకొద్దీ ఈవిదంగా అంచనా వ్యయాలు పెరుగుతూనే ఉంటాయని దీంతో స్పష్టం అవుతోంది. ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టులలో భారీగా అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు ఈ నిర్ణయంపై మళ్ళీ విమర్శలు, ఆరోపణలు గుప్పించడం తధ్యం.