హైదరాబాద్‌లో భారీ వర్షాలు...రోడ్లు జలమయం

రాజధాని హైదరాబాద్‌ నాగారంతో సహా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు  కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, జలపాతాలు పొంగి ప్రవహిస్తున్నాయి. హైదరాబాద్‌ నగరంలో యధాప్రకారం లోతట్టు ప్రాంతాలలో ఇళ్ళలోకి నీళ్ళు చేరుతున్నాయి. ఉప్పల్, రామాంతపూర్, కమలానగర్, ఎల్బీ నగర్‌, చైతన్యపురి, దిల్‌సుక్‌నగర్‌లోని పీ అండ్ టి కాలనీ, కోదండరాం నగర్, తదితర ప్రాంతాలలో కాలనీలలోకి నీళ్ళు వచ్చి చేరాయి. మురుగు కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో నగరంలో రోడ్లన్నీ జలమయం అవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుదవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారు జామువరకు హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తూనే ఉంది. నగరంలో నాగోల్ బండ్లగూడలో అత్యధికంగా 21.2 సెంటీమీటర్లు, హయాత్ నగర్‌లో 17.1 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. 

లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో జీహెచ్‌ఎంసీ, డిజాస్టర్ రెస్క్యూ టీమ్స్ అక్కడకు చేరుకొని సహాయ చర్యలు చేపట్టాయి.