సంబంధిత వార్తలు

మావోయిస్ట్ అగ్రనేతలలో ఒకరిగా చెప్పబడుతున్న రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ ఇవాళ్ళ హైదరాబాద్‌లో డిజిపి మహేందర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. పదో తరగతి చదువుతున్నప్పుడే మావోయిస్ట్ ఉద్యమంలో చేరి నేటి వరకు పోరాడిన రంజిత్, తమ ఉద్యమాల వలన సమాజంలో ఎటువంటి మార్పు సాధించలేమని భావించి లొంగిపోయారని డిజిపి మహేందర్ రెడ్డి చెప్పారు. అడవులలో కరోనా బారినపడి ఆరోగ్యసమస్యలతో బాధ పడుతున్న మిగిలిన మావోయిస్టులు కూడా బయటకు వచ్చి లొంగిపోయినట్లయితే వారికి సరైన వైద్యం చేయించి ప్రాణాలు కాపాడుతామని అన్నారు.