
హుజూరాబాద్ ఉపఎన్నికల గంట ఇంకా మ్రోగకపోయినా, టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు అక్కడ వాలిపోయి జోరుగా ప్రచారం చేస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్ నిన్న హుజూరాబాద్ సిటీ సెంటర్లో కులసంఘాలు, వివిద కార్మిక సంఘాల నేతలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్, ఓడినా గెలిచినా ప్రభుత్వం పడిపోదు. అలాగే బిజెపి గెలిచినా దాని జాబితాలో మరో ఎమ్మెల్యే పేరు చేరుతుంది తప్ప కొత్తగా ఒరిగేదేమీ ఉండబోదు. కానీ ఈటల గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధి కుంటుపడుతుంది. గత ఏడేళ్ళుగా ఆయన మంత్రిగా ఉన్న నియోజకవర్గం అభివృద్ధికి ఏమీ చేయలేదు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోలేని బిజెపి తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గం...ప్రజల కోసం ఏమీ చేయలేరు. కనుక ప్రజలు నియోజకవర్గం అభివృద్ధి కోరుకొంటున్నట్లయితే టిఆర్ఎస్ అభ్యర్ధికే ఓట్లేసి గెలిపించుకోవలసి ఉంటుంది. ఆగస్ట్ 15వ తేదీలోగా అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించి ఓట్లు అడుగుతాము,” అని అన్నారు.