
రైల్వే మంత్రిగా నియమితులైన మాజీ ఐఏఎస్ అధికారి అశ్విని వైష్ణవ్ బాధ్యతలు చేపట్టగానే తన కార్యాలయంలోని అధికారులు, సిబ్బందికి ఓ షాక్ ఇచ్చారు. ఇక నుంచి తన కార్యాలయంలో అందరూ రెండు షిఫ్టులలో పనిచేయాలని ఆదేశించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒక షిఫ్ట్, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 12.00 గంటల వరకు మరో షిఫ్టులో పనిచేయాలని ఆదేశించారు. తద్వారా తన కార్యాలయం రోజుకు 19 గంటలు పనిచేస్తూ రైల్వేశాఖలో అందరికీ అందుబాటులో ఉంటుందని, పనులు మరింత వేగంగా పూర్తవుతుంటాయని చెప్పినట్లు తెలుస్తోంది. కేవలం తన కార్యాలయంలో పని చేసే అధికారులు, సిబ్బందికి మాత్రమే ఈ రెండు షిఫ్టుల పద్దతి వర్తిస్తుందని, రైల్వేలోని మిగిలిన కార్యాలయాలకు ఇది వర్తించదని చెప్పారు. ఇది మంచి ఆలోచనే కానీ రెండో షిఫ్టులో అర్ధరాత్రి 12 గంటల వరకు పనిచేయమంటే అధికారులు, సిబ్బంది ఏమనుకొంటున్నారో ఊహించుకోవచ్చు.