
తెలంగాణ రాష్ట్రంలో సిఎం కేసీఆర్ను, టిఆర్ఎస్ పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవారిలో తీన్మార్ మల్లన్న కూడా ఒకరు. ఎమ్మెల్సీ ఎన్నికలతో రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశించి తన ఉనికిని చాటుకొన్నారు. ఆ ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి ఆయన వచ్చే శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సన్నాహాలు చేసుకొంటున్నారు. దానిలో బాగంగానే వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా 6,000 కిమీ మేర పాదయాత్ర చేయబోతున్నారు. దాని కోసం 33 జిల్లాలకు అడ్హక్ కమిటీలు, వాటికి కన్వీనర్లు, కోఆర్డినేటర్లు, రోడ్ మ్యాప్ అంతా సిద్దం చేసుకొన్నారు కూడా. కానీ పాదయాత్ర మొదలుపెట్టే ముందు తన ఆశయాలు, లక్ష్యం ఏమిటో ప్రజలకు తెలిపేందుకు ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ శివారులోని ఘట్కేసర్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఆ సభలోనే తన భవిష్య కార్యాచరణను కూడా ప్రకటిస్తామని ఆయన చెప్పారు.