తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భావం

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నేడు మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. వైఎస్ షర్మిల నేతృత్వంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని వైఎస్ షర్మిల ఈరోజు సాయంత్రం రాయదుర్గంలోని జెఆర్‌సీ కన్వెన్షన్ సెంటరులో ప్రారంభించారు. పార్టీ జెండాలో ఎడమవైపు నీలం, కుడివైపు పచ్చటి రంగు మద్యలో తెలుపు రంగులో తెలంగాణ చిత్రపఠం దానిలో స్వర్గీయ వైఎస్సార్ బొమ్మతో రూపొందించారు. దాని క్రింద నీలం రంగు అక్షరాలలో 'YSR తెలంగాణ పార్టీ' అని ముద్రించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల తల్లి విజయమ్మ పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నాయకుదంటే స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డిలాగా ఉండాలి. ఆయన తన శత్రువులను, రాజకీయ ప్రత్యర్ధులను గౌరవించేవారు. ఆయన ఆశయసాధన కొరకే వైఎస్ షర్మిల పార్టీని స్థాపిస్తున్నారు కనుక తెలంగాణ ప్రజలందరూ ఆమెను ఆశీర్వదించి అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.