జలజగడాలపై పవన్‌ కల్యాణ్‌ సందేహం

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మద్య కృష్ణా జలాల కోసం జరుగుతున్న జల జగడాలపై స్పందిస్తూ, “రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్య మంచి స్నేహసంబందాలున్నప్పుడు ఈవిదంగా నీళ్ళ కోసం రెండు ప్రభుత్వాలు కీచులాడుకోవడం అనుమానం కలిగిస్తోంది. వారు నిజంగానే తమ తమ రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ఘర్షణ పడుతున్నారా లేదా తమ రాజకీయ లబ్ధి కోసం ప్రజలను మభ్యపెట్టేందుకు ఈ డ్రామా ఆడుతున్నారా? అనే సందేహం కలుగుతోంది. దీనిపై రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఆలోచించాలి,” అని అన్నారు.