టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే దానంకు జైలు శిక్ష

ఖైరతాబాద్ టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించబడింది. 2013లో బంజారాహిల్స్ ప్రాంతంలో ఆయన ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపరిచారు. అప్పటి నుండి ఆ కేసును విచారిస్తున్న హైదరాబాద్‌లోని ప్రజాప్రతిధుల న్యాయస్థానం ఇవాళ్ళ ఆయనను దోషిగా నిర్ధారించి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విదించింది. అయితే ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకొనేందుకు నెలరోజులు గడువిస్తూ అంతవరకు శిక్ష అమలుచేయరాదని పోలీసులను ఆదేశించింది.