
నరేంద్రమోడీ రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండేళ్ల తరువాత నేడు మంత్రివర్గ విస్తరణ చేస్తున్నారు. మొదట ఈసారి 18 మందికి అవకాశం లభిస్తుందని తరువాత 28 మందికి లభిస్తుందని మీడియాలో ఊహాగానాలు వినిపించాయి. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ప్రధాని నరేంద్రమోడీ ఈసారి ఏకంగా 43 మందికి తన మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తున్నారు. వీరిలో చాలామంది కొత్తవారే కాగా కొంతమంది సహాయమంత్రులకు పదోన్నతి పొండనున్నారు.
ఈరోజు సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్ రాష్ట్రపతి భవన్‌లో కొత్త మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీతో సహా పలువురు కేంద్రమంత్రులు రాష్ట్రపతి భవన్‌కు చేరుకొన్నారు. మరికొద్ది సేపటిలో ప్రమాణస్వీకార కార్యక్రమం మొదలవుతుంది.