చెన్నమనేని పౌరసత్వం కేసు మళ్ళీ వాయిదా

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై హైకోర్టులో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. రమేష్ జర్మన్ పౌరసత్వం కలిగి ఉన్నారని కనుక ఎమ్మెల్యేగా అనర్హులని పేర్కొంటూ ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రత్యక్షంగా దాఖలు చేసిన కొన్ని డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉందని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఇప్పటికే రమేష్ జర్మన్ పౌరసత్వాన్ని వెనక్కి ఇచ్చేసినట్లు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఈనెల 15వ తేదీన ఇరుపక్షాల వాదనలు వినిపించాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే మరోసారి సమయాన్ని కోరవద్దని ఇరుపక్షాలను హైకోర్టు సూచించింది.