ఏపీ ప్రాజెక్టులపై గ్రీన్‌ ట్రిబ్యూనల్‌కు ఫిర్యాదు

తెలంగాణ, ఏపీ మధ్య జల రగడ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మొదటిసారిగా చెన్నై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. గతంలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై  గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం పనులు చేపడుతుందని ధిక్కరణ పిటిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వ దాఖలు చేసింది. పర్యావరణ శాఖ, జల శక్తి శాఖ, కృష్ణానది యాజమాన్య బోర్డు నుంచి రాయలసీమ ఎత్తిపోతల పనులకు అనుమతులు లేకుండానే ఏపీ ప్రభుత్వం నిర్మాణ పనులు చేపట్టిందని పిటిషన్‌లో తెలిపింది. గ్రీన్ ట్రిబ్యునల్ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అందుకు కావాల్సిన హెలికాప్టర్లు, ఇతర వాహనాలను సమకూరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.