హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడేళ్ళలో నగరంలో ఇప్పటికే అనేక ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ రోడ్లు నిర్మించింది. వాటిలో ఒకటైన బాలానగర్ ఫ్లై ఓవర్‌ను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించనున్నారు. రూ. 385 కోట్లు వ్యవయంతో నిర్మించిన దీనికి బాబు జగజ్జీవన్ రామ్ ఈ ఫ్లై ఓవర్‌గా నామకరణం చేశారు. ఆరు లేన్లతో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ పొడవు 1.13కిమీ వెడల్పు 24 మీటర్లు. ఇది అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్-కూకట్‌పల్లి-జీడిమెట్ల-సనత్ నగర్‌లను కలుపుతున్న బాలానగర్ పరిధిలోని నర్సాపూర్ చౌరస్తాలో ట్రాఫిక్ ఒత్తిడి, సమస్యలు తగ్గుతాయి. సిగ్నల్స్ వద్ద వేచి ఉండే బాధ తప్పుతుంది కనుక చిన్నా, పెద్ద వాహనాలు నర్సాపూర్ చౌరస్తా వద్ద ఈ ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లిపోతాయి కనుక ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.