సంబంధిత వార్తలు
19.jpg)
తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికులకు కూడా రైతన్న భీమా తరహాలోనే చేనేత భీమా కల్పిస్తామని సిఎం కేసీఆర్ ప్రకటించారు. నిన్న రాజన్న సిరిసిల్లా జిల్లా పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సిఎం కేసీఆర్, ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాష్ట్రంలో ఒక్క గుంట వ్యవసాయభూమి ఉన్న రైతు చనిపోయినా అతని కుటుంబానికి రూ.5 లక్షలు భీమా సొమ్ము చెల్లిస్తున్నాము. అలాగే రాష్ట్రంలో చేనేత కార్మికుల కుటుంబాలకు కూడా రూ.5 లక్షల చేనేత భీమాను అందజేస్తాం. ఒకటి రెండు నెలల్లోనే దీనికి సంబందించి విధివిధానాలు రూపొందించి అమలుచేస్తాం,” అని చెప్పారు.