సంబంధిత వార్తలు

రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీజేపీ ఫైర్ బ్రాండ్ విజయశాంతి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భూముల విక్రయానికి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ భూములను వేలం ప్రక్రియ తక్షణమే నిలిపివేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజయశాంతి పిటిషన్లో కోరారు. నిధుల సమీకరణ కోసం ప్రభుత్వ భూములను విక్రయించాలనికోవడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో తెలిపారు.