వైఎస్ షర్మిలకు మరోషాక్...గట్టు శ్రీకాంత్ రెడ్డి గుడ్ బై

వైఎస్ షర్మిల ఇంకా పార్టీ ప్రకటించక మునుపే వైసీపీ నేతలు గుడ్ బై చెప్పేసి వేరే పార్టీలలో చేరుతుండటం విశేషం. తెలంగాణ రాష్ట్ర వైసీపీ మాజీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి గురువారం రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ సమక్షంలో బిజెపిలో చేరిపోయారు. బహుశః వైఎస్ షర్మిల ఆయనకు ప్రాధాన్యం ఇవ్వనందునే బిజెపిలో చేరి ఉండవచ్చు. వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో తన బలం పెంచుకొనే ప్రయత్నాలు చేస్తుండగా మరోపక్క పార్టీ ముఖ్యనేతలు ఒకరొకరుగా గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతుండటం ఆమెకు చాలా ఇబ్బందికరమే. పైగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మద్య నీళ్ళ కోసం మొదలైన గొడవలు, నాగార్జునసాగర్ ప్రాజెక్టులో జలవిద్యుత్ ఉత్పత్తిపై గొడవలు ఆమెకు మరో సవాలుగా మారే అవకాశం ఉంది.