రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం కొత్తగా ఏర్పాటుచేసిన జోనల్ వ్యవస్థలో మార్పులకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. నారాయణపేట జిల్లాను జోగులాంబ జోన్‌లో, ములుగు జిల్లాను కాళేశ్వరం జోన్‌లో చేర్చుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. అలాగే స్థానికంగా ఉన్న ప్రజల విజ్ఞప్తుల మేరకు వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్‌కు మార్చారు.
కనుక ఇకనుంచి రాబోయే అన్ని ప్రభుత్వ ప్రకటనలు ఈ జోనల్ పరిధిలోనే వస్తాయి. వాటితోనే స్థానికతను నిర్ణయించి ఆ ప్రకారమే ఉద్యోగ నియామకాలు చేపట్టనుంది.
ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ దీనికి సంబంధించిన బుదవారం ఉత్తర్వులు జారీ చేశారు.