సంబంధిత వార్తలు

జూలై 19 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
జూలై 19 నుంచి ఆగస్ట్ 13 వరకు వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని పార్లమెంటు వ్యవహారాల
కమిటీ సిఫార్సు చేసింది. కరోనా కారణంగా గత ఏడాదిన్నరగా పూర్తిస్థాయిలో పార్లమెంటు సమావేశాలు
నిర్వహించడం సాధ్యపడలేదు. కరోనా కారణంగా 2021 బడ్జెట్ సమావేశాలు కూడా కుదించకతప్పలేదు.
ప్రస్తుతం దేశంలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది కనుక ఈసారి నాలుగు వారాలపాటు
సమావేశాలు నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేసింది. కరోనా తీవ్రత తగ్గినప్పటికీ ఎప్పటిలాగే
పూర్తి జాగ్రత్తలు తీసుకొని వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని సూచించింది.