కేటీఆర్‌ కుమారుడు హిమాన్షుకి అంతర్జాతీయ అవార్డు

సిఎం కేసీఆర్‌ మనుమడు, మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు అంతర్జాతీయ అవార్డు అందుకొన్నాడు. బ్రిటన్ దివంగత యువరాణి డయానా పేరిట ఏర్పాటు చేసిన తెస్సి ఓజో సీబీఈ అనే ఓ ట్రస్ట్ ప్రపంచవ్యాప్తంగా 9-25 ఏళ్ళలోపు సామాజిక సేవలు అందిస్తున్నవారికి ఏటా ఈ డయానా అవార్డు అందజేస్తోంది. ఈ ఏడాది (2021) ఆ అవార్డును హిమాన్షు అందుకొన్నారు. 

అతను శోమ అనే కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలోని గంగాపూర్, యూసఫ్ ఖాన్ పల్లి గ్రామాల స్వయం సమృద్ధి సాధించేందుకు కృషి చేసినందుకు ఈ అవార్డు లభించింది. ఈవిషయం హిమాన్షు స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ సందర్భంగా తనకు సహకరించిన తాత కేసీఆర్‌, తండ్రి కేటీఆర్‌లకు, రెండు గ్రామాల ప్రజలకు హిమాన్షు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.