
నేటితో మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాలు ముగుస్తున్నాయి. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సిఎం కేసీఆర్ కలిసి హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డు వద్ద గల జ్ఞానభూమిలో 26 అడుగుల ఎత్తైన పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు పీవీ మార్గ్ ను ప్రారంభించారు.
అచ్చమైన కాంగ్రెస్‌వాది స్వర్గీయ పీవీని ఆ పార్టీ అధిష్టానం పెద్దగా పట్టించుకోనప్పటికీ, తెలంగాణ బిడ్డడైనందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయన స్మృత్యర్ధం ఏడాదిపాటు చాలా ఘనంగా ‘పీవీ శతజయంతి ఉత్సవాలను’ నిర్వహిస్తోంది. అంతేకాదు..సిఎం కేసీఆర్ స్వర్గీయ పీవీ కుమార్తె సురభి వాణీదేవికి ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇచ్చి గెలిపించుకొని పీవీ కుటుంబం పట్ల కృతజ్ఞతలు ప్రకటించుకున్నారు.